
Yogi Adityanath: రాహుల్ ప్రమాదవశాత్తు హిందువు: యోగి
ఈనాడు, లఖ్‌నవూ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రమాదవశాత్తు(యాక్సిడెంటల్) హిందువు అయ్యారని, అసలైన హిందుత్వవాదులు ఎవరో ప్రజలకు బాగా తెలుసని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తాము అనుకోకుండా హిందువులమయ్యామని రాహుల్ పూర్వీకులే స్వయంగా చెప్పుకునేవారని పేర్కొన్నారు. ఓసారి రాహుల్ గుజరాత్‌లోని ఓ గుడికి వెళ్లినప్పుడు అక్కడ మోకాళ్లపై కూర్చున్నారని, అప్పుడు అర్చకుడు ఆయనతో ఇది మసీదు కాదని ఆగ్రహం వ్యక్తంచేశారని.. పద్మాసనంలో కూర్చోమని చెప్పారని యోగి తెలిపారు. ఆ సంస్కారం గురించి తెలియనివారు కూడా ఇప్పుడు హిందువులకు, హిందుత్వకు మధ్య భేదంపై పాఠాలు బోధిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నేతలు ఆలయాల చుట్టూ తిరుగుతూ తామే నిజమైన హిందువులమని ప్రచారం చేసుకొనేందుకు తహతహలాడుతున్నారని, ప్రజలు వారికన్నా తెలివైన వారని, ఎవరు హిందుత్వవాదులో వారికి బాగా తెలుసని అన్నారు. సోమవారం అమేఠీలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆయన రూ.86.42 కోట్లతో నిర్మించిన 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. రూ.293 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.