Compensation:ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.800 కోట్ల పరిహారం

కెనడాకు చెందిన ఆరుగురు వ్యక్తుల దుర్మరణానికి కారణమైన ఇరాన్‌.

Published : 05 Jan 2022 11:38 IST

ఉక్రెయిన్‌ విమానం కూల్చివేతలో కెనడాలో తీర్పు

దుబాయ్‌: కెనడాకు చెందిన ఆరుగురు వ్యక్తుల దుర్మరణానికి కారణమైన ఇరాన్‌.. మృతుల కుటుంబాలకు 10.7 కోట్ల డాలర్ల (సుమారు రూ.800 కోట్ల) నష్ట పరిహారం చెల్లించాలని కెనడాలోని ఆంటారియో సుపీరియర్‌ కోర్టు ఆదేశించింది. 2020 జనవరిలో బాగ్దాద్‌లో ఇరాన్‌ సేనాని కాసిం సులేమానీని డ్రోన్‌ దాడితో అమెరికా హతమార్చింది. దానికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడి జరిపింది. ఆ హడావిడిలో ఇరాన్‌ ప్రయోగించిన రెండు క్షిపణులు ఆకాశంలో ఉక్రెయిన్‌ పౌర విమానాన్ని కూల్చేయడంతో అందులోని 176 మంది ప్రయాణికులు మరణించారు. విమానాన్ని కూల్చివేసిన కొన్నిరోజులకు ఇరాన్‌ సైన్యం బహిరంగంగా క్షమాపణచెప్పింది. మృతుల్లో ఆరుగురు కెనడా పౌరులున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని