చైనా సేనలు అజేయశక్తిగా ఎదగాలి: అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
పదేళ్లుగా అధికారిక చైనా కమ్యూనిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్న షీ జిన్‌పింగ్ (68) దేశ సాయుధ దళాల శిక్షణకు
బీజింగ్: పదేళ్లుగా అధికారిక చైనా కమ్యూనిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్న షీ జిన్‌పింగ్ (68) దేశ సాయుధ దళాల శిక్షణకు మంగళవారం కొత్త ఆదేశాలు జారీ చేశారు. యుద్ధపోరాటంలో అజేయ శక్తిసామర్థ్యాలు పెంపొందించుకొని, ఉత్తమసేనగా నిలవటమే ఈ శిక్షణ లక్ష్యం. దేశాధ్యక్షుడిగా ఉంటూ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్‌గా 20 లక్షల సేనలపై తిరుగులేని పట్టు సాధించిన షీ జిన్‌పింగ్ దేశ సైన్యం సాంకేతికంగా, సామర్థ్యాలపరంగా ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండేలా పలు సంస్కరణలు తీసుకువచ్చారు. గతంలో చైనాకు సారథ్యం వహించిన అధ్యక్షులకు భిన్నంగా సుదీర్ఘకాలం దేశ పాలనాపగ్గాలు తన చేతిలో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్న షీ ఈ ఏడాదితో రెండు పర్యాయాల పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారు. మూడోసారి మరో అయిదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగే వ్యూహం కూడా సిద్ధమైంది. 2018 నుంచి ఏటా కొత్త కొత్త కార్యక్రమాలతో సైన్యంపై ప్రత్యేకదృష్టి పెట్టి, ఇపుడు ఏకంగా 200 బిలియన్ డాలర్ల (రూ.14.9 లక్షల కోట్లు) వార్షిక రక్షణ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. సాంకేతిక మార్పులు, యుద్ధరీతులు, శత్రుసేనల గురించి అధ్యయనం చేయడం ద్వారా.. మరిన్ని రెట్లు మెరుగైన సామర్థ్యం చూపేలా సుశిక్షితులు కావాలంటూ షీ తాజా ఆదేశాల్లో సేనలకు సూచనలు చేసినట్లు అధికారిక పత్రిక షిన్హువా వెల్లడించింది. ఆర్మీ అధికారులు, సేనలు ఎవరూ ఇటు మృత్యువుకు.. అటు కఠోరశ్రమకు వెరవకుండా ఈ శిక్షణ ఉండాలని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వంతోపాటు సీఎంసీ ప్రణాళికలు ఆచరణలో పెడుతూ.. జాతీయ భద్రత, మారుతున్న పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని తన ఆదేశాల్లో షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్‌లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా