మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీ.. గోప్యతకు భంగమే:మద్రాస్‌ హైకోర్టు

మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీ ఏర్పాటు చేయడం గోప్యతకు భంగం కలిగించడమేనని మద్రాస్‌ హైకోర్టు పేర్కొంది. మంగళవారం

Updated : 06 Jan 2022 10:29 IST

మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీ ఏర్పాటు చేయడం గోప్యతకు భంగం కలిగించడమేనని మద్రాస్‌ హైకోర్టు పేర్కొంది. మంగళవారం ఓ కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సీసీటీవీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ని ఉల్లంఘించినట్లేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలోని మదురై బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి గోప్యతకు భంగం కలిగిస్తూ సీసీటీవీ ఏర్పాటు చేయాలంటే అందుకు బలమైన కారణం కావాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మసాజ్‌ సెంటర్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని సంబంధిత యజమాని చేస్తున్న ప్రయత్నాలను తిరుచిరాపల్లి పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై యజమాని కోర్టును ఆశ్రయించారు. తనకు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ ఇప్పిస్తూ తిరుచిరాపల్లి పోలీసులకు తగు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనులో పేర్కొన్నారు. పోలీసు చర్యను సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని