కేశాలంకరణకు ఉమ్మి.. మహిళా కమిషన్‌ ఆగ్రహం

ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు జావెద్‌ హబీబ్‌ ఓ మహిళ కేశాలను తీర్చిదిద్దుతూ ఉమ్మి కలిపినట్లుగా వైరల్‌ అవుతున్న వీడియోలో

Updated : 27 Feb 2024 15:38 IST

దిల్లీ: ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు జావెద్‌ హబీబ్‌ ఓ మహిళ కేశాలను తీర్చిదిద్దుతూ ఉమ్మి కలిపినట్లుగా వైరల్‌ అవుతున్న వీడియోలో వాస్తవికత ఎంతో నిగ్గు తేల్చాలని జాతీయ మహిళా కమిషన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులను ఆదేశించింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఈ సంస్థ నిర్వహించిన వర్క్‌షాపులో పై సంఘటన చోటు చేసుకున్నట్లుగా వీడియోలో ఉంది. ‘ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. సత్వరం విచారణ జరపండి. ఇది కొవిడ్‌ కోణంలోనూ శిక్షార్హమైన నేరమే’ అని కమిషన్‌ యూపీ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది. హెయిర్‌ స్టయిలిస్టుకు కూడా కమిషన్‌ నోటీసు పంపింది. ‘నీళ్లకు కొరత ఉంటే.. మీ ఉమ్మిని కూడా వాడవచ్చు’ అనే వ్యాఖ్య ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు సైతం విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం తీవ్రతరం అవుతుండటంతో జావెద్‌ హబీబ్‌ ఓ వీడియో సందేశం ద్వారా క్షమాపణ కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని