కొవిడ్‌ సోకిందని కుమారుడిని కారు డిక్కీలో ఉంచిన తల్లి

తనకు కరోనా సోకకూడదని కుమారుడిని కారు డిక్కీలో బంధించింది

Updated : 09 Jan 2022 12:15 IST

హ్యూస్టన్‌: తనకు కరోనా సోకకూడదని కుమారుడిని కారు డిక్కీలో బంధించింది ఓ తల్లి. ఈ సంఘటన టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జరిగింది. సారా బీమ్‌ (41) స్థానిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు. కొవిడ్‌ సోకిన తన పదమూడేళ్ల కుమారుడికి మరోసారి పరీక్ష చేయించడానికి సోమవారం ఆమె  హ్యారిస్‌ కౌంటీలోని డ్రైవ్‌ త్రూ కొవిడ్‌ కేంద్రానికి కారులో వచ్చింది. తన కొడుక్కి కరోనా సోకిందని, డిక్కీలో ఉన్నాడని అక్కడి అధికారికి తెలిపింది. డిక్కీ నుంచి బయటికి తీస్తే.. పరీక్ష చేస్తామని ఆ అధికారి చెప్పారు. అందుకు బీమ్‌ తిరస్కరించించి.. అక్కడి నుంచి కారులో వెళ్లిపోయింది. వెంటనే ఆ అధికారి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. డిక్కీలో ఉన్న తన కొడుకును అధికారికి బీమ్‌ చూపిస్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. బుధవారం బీమ్‌పై అరెస్టు వారెంట్‌ కూడా జారీ అయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని