Omicron: బూస్టర్‌ డోసుతో ఒమిక్రాన్‌ నుంచి అధిక రక్షణ

ఒమిక్రాన్‌ కారణంగా వృద్ధుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినకుండా

Updated : 09 Jan 2022 12:21 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

లండన్‌: ఒమిక్రాన్‌ కారణంగా వృద్ధుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినకుండా బూస్టర్‌ డోసు అధిక రక్షణ కల్పిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పరిశోధకులు ఈ విశ్లేషణ సాగించారు. 65 ఏళ్లు దాటినవారు మూడో డోసు తీసుకుంటే, ఆసుపత్రుల్లో చేరాల్సినంత అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి 90% వరకూ రక్షణ లభిస్తున్నట్టు అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ‘‘రెండో డోసు తీసుకున్నవారికి తీవ్ర అనారోగ్యం ముప్పు నుంచి మంచి రక్షణే లభిస్తుంది. కానీ, టీకా సామర్థ్యం 3 నెలలకే సుమారు 25%, ఆరు నెలలకు 50% తగ్గిపోతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బూస్టర్‌ డోసు తీసుకుంటే ఆ సమస్య ఉండదు. తీవ్రస్థాయి కొవిడ్‌ నుంచి వృద్ధులకు దీర్ఘకాల రక్షణ లభిస్తుందని మా అధ్యయనంలో తేలింది’’ అని కొవిడ్‌-19 ఇమ్యునైజేషన్‌ విభాగం ఉన్నతాధికారి ప్రొఫెసర్‌ వీషెన్‌ లిమ్‌ తెలిపారు. కరోనా సోకేందుకు ఆస్కారమున్న వ్యక్తులు ఇప్పటికిప్పుడే నాలుగో డోసు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు