Updated : 11 Jan 2022 10:34 IST

Omicron: ఒమిక్రాన్‌తో వ్యాధి లక్షణాలు స్వల్పమే

ఎయిమ్స్‌ డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ వెల్లడి 

దిల్లీ: ఎక్కువ మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని ఎయిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ తెలిపారు. ఆయా లక్షణాలను బట్టి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ మహమ్మారి కోరల్లో నుంచి బయటపడొచ్చని అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో అదనపు ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ నిశ్చల్‌ ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ‘‘సానుకూల ఆలోచనా దృక్పథం, పారాసెటమాల్‌ మాత్రలతో అత్యధికులు కొవిడ్‌ నుంచి బయటపడవచ్చు. ఇప్పటివరకైతే ఎక్కువ మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. వాటికి అనుగుణంగా ఇంట్లోనే సులభంగా చికిత్స తీసుకోవచ్చు.

ఇతర అనారోగ్య సమస్యలున్న వృద్ధులు, కరోనా టీకా వేసుకోనివారు వైరస్‌ బారిన పడితే మాత్రం.. వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’’ అని పేర్కొన్నారు. మోల్నుపిరవిర్‌ను మ్యాజిక్‌ పిల్‌గా భావించడం సరికాదని నిశ్చల్‌ అన్నారు. దానిపై ప్రయోగాల కోసం ఆధారపడిన కరోనా వేరియంట్, అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు భిన్నమని చెప్పారు. తీవ్రస్థాయి అనారోగ్యానికి గురయ్యే ముప్పున్నవారి కోసమే.. ఆ ఔషధానికి అత్యవసర వినియోగ సంబంధిత అనుమతులు మంజూరు చేసిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని