Parliament:60 ఏళ్లు పైబడిన ఎంపీలపై ప్రత్యేకశ్రద్ధ పెట్టండి

పార్లమెంటులో పెద్దఎత్తున సిబ్బంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మంగళవారం

Published : 12 Jan 2022 11:14 IST

లోక్‌సభ సిబ్బందికి స్పీకర్‌ ఓంబిర్లా ఆదేశం

దిల్లీ: పార్లమెంటులో పెద్దఎత్తున సిబ్బంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మంగళవారం పార్లమెంటు భవనం ప్రాంగణమంతా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈనెలాఖరు నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీల రాజ్యాంగ విధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 60 ఏళ్ల పైబడిన ఎంపీలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, వారి అవసరాలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. పార్లమెంటు భవనంలో నడుస్తున్న కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన స్పీకర్‌.. ఇక్కడి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్య భద్రతకు ఉన్న సదుపాయాలను తెలుసుకున్నారు. ఇంకా ఎలాంటి అదనపు సేవలు కావాల్సి ఉన్నా వెంటనే సమకూర్చుకోవాలని చెప్పారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని, పాజిటివ్‌గా తేలిన వారి ఆరోగ్య పరిస్థితులను నిరంతరం గమనించాలని నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని