ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ నిర్మాణంలో 396 చెట్లకు మళ్లీ జీవం!

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ నిర్మాణానికి.. 

Published : 21 Jan 2022 11:05 IST

దిల్లీ: సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ నిర్మాణానికి.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని మినహాయింపులు కల్పిస్తున్నట్లు దిల్లీ అటవీ శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో 396 చెట్లను పెకిలించి.. తిరిగి నాటుతారని తెలిపింది. వాటిలో 135 వృక్షాలను ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో, మరో 261 చెట్లను బాదర్‌పుర్‌లోని ఎన్‌టీపీసీ ఎకో పార్క్‌లో తిరగనాటుతారని పేర్కొంది. అదనంగా ఎన్‌టీపీసీ ఎకో పార్క్‌లో వేప, రావి వంటి 3,960 మొక్కలు నాటాలని.. వాటిని ఏడేళ్ల పాటు సంరక్షించేందుకు రూ.2.25 కోట్లు జమ చేయలని కూడా సీపీడబ్ల్యూడీని ఆదేశించినట్లు వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని