
Updated : 21 Jan 2022 10:55 IST
అరుదైన ఘటన:చనిపోయిందన్న శిశువు..పూడ్చేముందు ఏడ్చింది!
వైద్యులు చనిపోయిందని నిర్థారించిన శిశువు.. పూడ్చిపెట్టడానికి ముందు ఒక్కసారిగా కదిలి గుక్కపెట్టి ఏడ్చింది. ఒడిశాలోని కెందుఝర్ జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఖందికపడ గ్రామానికి చెందిన రాయ్‌మణి బుధవారం పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరగా ప్రసవమైంది. అయితే శిశువు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. చేసేదేమీ లేక.. మృత శిశువును ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం పూడ్చిపెట్టడానికి శ్మశానానికి వెళ్లారు. గుంతలో పెట్టడానికి ఒక్క నిమిషం ముందు ఏడ్చింది శిశువు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నిర్లక్ష్యంగా బతికున్న శిశువును చనిపోయినట్లు చెప్పారంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. సదరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags :