మౌనీ అమావాస్య వేళ గంగానదిలో.. 1.50 కోట్ల భక్తుల పుణ్యస్నానాలు

కరోనా వైరస్‌ భయం ఓవైపు వెంటాడుతున్నప్పటికీ.. మౌనీ అమావాస్య సందర్భంగా సోమ,  మంగళవారాలు గంగానదిలో ..

Published : 02 Feb 2022 10:48 IST

అలహాబాద్‌: కరోనా వైరస్‌ భయం ఓవైపు వెంటాడుతున్నప్పటికీ.. మౌనీ అమావాస్య సందర్భంగా సోమ,  మంగళవారాలు గంగానదిలో 1.50 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున, సరస్వతి (పౌరాణిక కాలం నాటి) నదుల సంగమ స్థానానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చినట్లు మాఘ్‌ మేలా అధికారవర్గాలు తెలిపాయి. విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, గజ ఈతగాళ్లను సిద్ధం చేసి.. సీసీ టీవీలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి. నదీతీరంలో భక్తుల చేత పిండప్రదానం చేయిస్తున్న పండా భోలా త్రిపాఠి మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం 2.20 నుంచి మంగళవారం ఉదయం 11.16 దాకా మౌనీ అమావాస్య ముహూర్తమని తెలిపారు. పురాణాల ప్రకారం.. సూర్యాస్తమయానికి ముందు అమావాస్య తేదీ మొదలైతే ‘సోమవతీ అమావాస్య’ అంటారని, ఈ ముహూర్తంలో పిండప్రదానం చేస్తే పూర్వీకులు సంతోషిస్తారని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు