Arpita mukherjee: ఎవరీ అర్పితా ముఖర్జీ?
పార్థా ఛటర్జీకి సన్నిహితురాలుగా భావిస్తున్న అర్పితా ముఖర్జీ సినీనటి, మోడల్. ఆమె బెంగాలీ, ఒరియా, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య, ఛటర్జీ సన్నిహితురాలిగా భావిస్తున్న అర్పితా ముఖర్జీని కూడీ ఈడీ అదుపులోకి తీసుకుంది.
అర్పితా ముఖర్జీ సినీనటి, మోడల్. ఆమె బెంగాలీ, ఒరియా, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఛటర్జీకి చెందిన, కోల్‌కతాలోనే పెద్దదైన దుర్గ పూజా కమిటీలో 2019, 2020లలో ఆమె చురుగ్గా వ్యవహరించారు. ఆ సమయంలో అర్పితకు ఛటర్జీతో పరిచయం ఏర్పడింది. ఈడీ తనిఖీల విషయం తెలిసిన వెంటనే దుర్గామాత పూజలో ఆమె, పార్థా ఛటర్జీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి పాల్గొన్న పాత చిత్రాన్ని భాజపా నేత సువేందు అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పార్థా చటర్జీ అరెస్టు తర్వాత అర్పితనూ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమె తన వద్ద రూ.21 కోట్ల నగదు ఎందుకు ఉందో సరైన వివరణ ఇవ్వలేదని ఈడీ తెలిపింది. కుంభకోణంతో ప్రమేయం ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది. అంతకుముందు అర్పితా ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ.. తన నివాసంలో నగదు పట్టుబడటం భాజపా కుట్రగా ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!