Jalpaiguri:జల్పాయ్‌గురిలో తీవ్ర విషాదం, 8మంది దుర్మరణం

పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో దసరా రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మాల్‌ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంలో ఈ ప్రమాదం సంభవించింది. నదీప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రవాహం ధాటికి కొట్టుకుపోయి 8మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు వెల్లడించారు.

Updated : 06 Oct 2022 05:16 IST

పలువురి గల్లంతు

జల్పాయ్‌గురి: పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో దసరా రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మాల్‌ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంలో ఈ ప్రమాదం సంభవించింది. నదీప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రవాహం ధాటికి కొట్టుకుపోయి 8మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు వెల్లడించారు. వరదలో పలువురు కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. 50మందిని రక్షించామని, గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని