బామ్మ ఈత.. బంగారు విజేత

జాతీయ ఈత పోటీల్లో 82 ఏళ్ల వృద్ధురాలు బంగారు పతకం సాధించారు. వందల మంది పోటీదారులతో హోరాహోరీగా తలపడి మొదటి స్థానంలో నిలిచారు.

Updated : 28 Nov 2022 06:12 IST

జాతీయ ఈత పోటీల్లో 82 ఏళ్ల వృద్ధురాలు బంగారు పతకం సాధించారు. వందల మంది పోటీదారులతో హోరాహోరీగా తలపడి మొదటి స్థానంలో నిలిచారు. హరియాణాలోని అంబాలా జిల్లాలో శనివారం జరిగిన జాతీయ ఈత పోటీల్లో బామ్మ ఈ ఘనత సాధించారు. జిల్లాలోని హీరోస్‌ మెమోరియల్‌ వద్ద మూడు రోజుల పాటు జాతీయ ఈత పోటీలు అట్టహాసంగా సాగాయి. దేశ వ్యాప్తంగా 750 మంది అథ్లెట్‌లు పోటీల్లో పాల్గొన్నారు. బిహార్‌కు చెందిన లాల్‌ పారి రాయ్‌ అనే 82 ఏళ్ల వృద్ధురాలు మహిళల సీనియర్‌ సిటిజన్‌ విభాగం(100 మీటర్ల పోటీ)లో బంగారు పతకం కైవసం చేసుకున్నారు. కాగా.. బామ్మకు 30 ఏళ్లకు పైగా ఈతలో ప్రావీణ్యం ఉంది. నీటిలో మునిగిపోతున్న ఎంతో మందిని కాపాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని