ఏడుపదుల స్నేహం.. విడదీయలేదు మరణం

బాల్యం నుంచీ డెబ్బై ఏళ్లపాటు ఆ ఇద్దరు మిత్రులు కలిసి మెలిసి తిరిగారు. చివరకు.. మరణంలోనూ వారిది విడదీయలేని బంధంగా మారింది.

Updated : 17 Dec 2022 06:54 IST

బాల్యం నుంచీ డెబ్బై ఏళ్లపాటు ఆ ఇద్దరు మిత్రులు కలిసి మెలిసి తిరిగారు. చివరకు.. మరణంలోనూ వారిది విడదీయలేని బంధంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లా తవాయి ప్రాంతానికి చెందిన రామ్‌కృపాల్‌, మసూరుద్దీన్‌ బాల్యమిత్రులు. రోజంతా ఆడుతూ పాడుతూ కలిసి తిరిగేవారు. రాత్రి నిద్రపోవడానికి మాత్రమే ఎవరి ఇళ్లకు వారు వెళ్లేవారు. యవ్వనంలోనూ ఇదే తీరు. వృద్ధాప్యం వచ్చాక కలిసి విహారయాత్రలకు వెళ్లేవారు.

మసూరుద్దీన్‌ ఆరోగ్యం ఇటీవల దెబ్బతింది. దీంతో రామ్‌కృపాల్‌ ప్రతిరోజూ మిత్రుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి ఆరా తీస్తూ ఉండేవారు. అనారోగ్యంతో మసూరుద్దీన్‌ గురువారం ఉదయం మరణించారు. మసూరుద్దీన్‌ కుటుంబసభ్యులు ఈ విషయాన్ని రామ్‌కు తెలియనివ్వలేదు. ఎలాగోలా మిత్రుడి మరణవార్త తెలుసుకొన్న రామ్‌కృపాల్‌ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ మిత్రుడి ఇంటికి చేరుకున్నారు. మసూరుద్దీన్‌ మృతదేహం మీద పడి.. ‘దేవుడా! మిత్రుడు లేని ప్రపంచం నుంచి నన్ను కూడా తీసుకువెళ్లు’ అని ప్రార్థించారు. అలా అన్న కొద్దిక్షణాల్లోనే రామ్‌ ప్రాణాలు విడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని