బామ్మకు అస్వస్థత.. రిక్షా లాగుతూ ఆసుపత్రికి తీసుకెళ్లిన మనవడు

అస్వస్థతకు గురైన బామ్మను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డాడు ఎనిమిదేళ్ల మనవడు. అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో వృద్ధురాలిని రిక్షాపై ఉంచి లాగుతూ వైద్యశాలకు తీసుకెళ్లాడు.

Published : 20 Dec 2022 07:43 IST

అస్వస్థతకు గురైన బామ్మను ఆసుపత్రికి¨ తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డాడు ఎనిమిదేళ్ల మనవడు. అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో వృద్ధురాలిని రిక్షాపై ఉంచి లాగుతూ వైద్యశాలకు తీసుకెళ్లాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని బొకారోలో జరిగింది. చందన్‌కియారిలోని బగన్‌తోలకు చెందిన మారురా దేవి (75 ఏళ్లు) ఆరోగ్యం క్షీణించింది. ఆమెను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు. కుమారుడు పనికి వెళ్లాడు.  బామ్మ  పరిస్థితిని చూసిన 8 ఏళ్ల సూరజ్‌.. రిక్షాపై ఆమెను పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ‘‘బామ్మ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాను. అయినా, ఆమెకు నయం కాలేదు. బామ్మకు మంచి వైద్యం అందించాలి’’ అని సూరజ్‌ వేడుకుంటున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు