Twins: పోలికల్లోనే కాదు.. మార్కుల్లోనూ వీరు కవలలే..

పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు కవలలు పోలికల్లోనే కాదు.. చదువులోనూ ఒకేలా మార్కులను సంపాదించారు. వారిద్దరూ వేర్వేరు విభాగాల్లో చదువుకున్నా సరే.. ఫలితాల్లో మాత్రం ఒకేలా మార్కులు రావడం విశేషం.

Updated : 26 Dec 2022 06:47 IST

పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు కవలలు పోలికల్లోనే కాదు.. చదువులోనూ ఒకేలా మార్కులను సంపాదించారు. వారిద్దరూ వేర్వేరు విభాగాల్లో చదువుకున్నా సరే.. ఫలితాల్లో మాత్రం ఒకేలా మార్కులు రావడం విశేషం. కోల్‌కతాలోని జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వీరిద్దరూ.. 9.54 జీపీఏ సాధించి యూనివర్సిటీ టాపర్‌లుగా నిలిచారు. ఈ మేరకు డిసెంబర్‌ 24న జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు, ధ్రువీకరణపత్రాలు అందుకున్నారు.

కోల్‌కతా నగరానికి చెందిన సుభేందు, దివేందు ప్రమాణిక్‌లు 5 నిమిషాల తేడాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆడుకోవడం, చదువుకోవడం.. అన్నీ కలిసే చేసేవారు. వీరి ప్రవర్తన కూడా ఒకేలా ఉండేది. పదో తరగతి వరకూ ఇద్దరూ కలిసే చదవుకున్నారు. ఇంటర్‌ నుంచి వేర్వేరు సబ్జెక్ట్‌లను ఎంచుకున్నారు. విభాగం ఏదైనా సరే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక జాదవ్‌పుర్‌ యూనివర్సిటీలో చోటు సంపాదించారు.

సుభేందు జియాలజీ విభాగాన్ని ఎంచుకోగా.. దివేందు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరి విభాగాలు వేరైనా రోజూ కలిసే చదువుకునేవారు. దీంతో వారిద్దరూ సమానంగా.. 9.54 జీపీఏ సాధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారు. దివేందు ఐఐటీ-ఖరగ్‌పుర్‌లో ఉన్నత చదువును కొనసాగించనుండగా.. సుభేందు జర్మనీ వెళ్లనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని