రక్షణపరమైన మౌలిక వ్యవస్థలను నవీకరిస్తున్న భారత్‌

పాకిస్థాన్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి రక్షణపరమైన మౌలికవ్యవస్థలను భారత్‌ బలోపేతం చేస్తోంది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 2,289 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండగా.. అందులో 192 కిలోమీటర్లు జమ్మూ ప్రాంతంలోనే ఉంది.

Published : 26 Dec 2022 04:56 IST

పాక్‌ సరిహద్దులో జోరుగా పనులు

దిల్లీ: పాకిస్థాన్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి రక్షణపరమైన మౌలికవ్యవస్థలను భారత్‌ బలోపేతం చేస్తోంది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 2,289 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండగా.. అందులో 192 కిలోమీటర్లు జమ్మూ ప్రాంతంలోనే ఉంది. తొలి దశలో భాగంగా జమ్మూ ప్రాంతంలో 26 కిలోమీటర్ల పొడవునా పనులను చేపట్టారు. మరో 33 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బంకర్లను పటిష్ఠం చేయడంతో పాటు సైనిక ట్యాంకుల రాకపోకలకు ర్యాంపులను నిర్మించారు. గట్ల పునరుద్ధరణ, కంచెలకు మరమ్మతులు, బీఎస్‌ఎఫ్‌ పోస్టుల నవీకరణ తదితర పనులూ ఉన్నాయని అధికారులు తెలిపారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌లకు బీఎస్‌ఎఫ్‌ దళాలను తరలించే వాహనాలు సులువుగా ప్రయాణించేందుకు మట్టి రహదారులను చదును చేశారు. కశ్మీర్‌ ప్రాంతంలోనూ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఈ పనులను చేపట్టారు. 2021లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇంత భారీ ఎత్తున మౌలిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు