IST: ఇక దేశమంతటా భారత ప్రామాణిక సమయమే!

దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ భారత ప్రామాణిక సమయాన్ని (ఐఎస్‌టీ) అనుసరించడం ఇకపై తప్పనిసరి కానుంది! ఇందుకోసం సమగ్ర విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

Updated : 06 Jan 2023 09:55 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ భారత ప్రామాణిక సమయాన్ని (ఐఎస్‌టీ) అనుసరించడం ఇకపై తప్పనిసరి కానుంది! ఇందుకోసం సమగ్ర విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే యోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లు, కంప్యూటర్లను ఐఎస్‌టీతో అనుసంధానించడం; టెలికం సర్వీసు ప్రొవైడర్లు, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లు, పవర్‌గ్రిడ్లు, బ్యాంకులు, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల వంటివన్నీ ఆ ప్రామాణిక సమయాన్నే అనుసరించేలా చేయడమే దాని ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికం, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లు ఐఎస్‌టీని అనుసరించడం తప్పనిసరేమీ కాదు. గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (జీఎన్‌ఎస్‌ఎస్‌) వంటి ఇతర సోర్సులతో అనుసంధానమైన సర్వర్లను అవి ఉపయోగించుకుంటున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని