ATM: ఇది నూలు సంచుల ఏటీఎం

ఇప్పటికే వరుసగా ఆరుసార్లు స్వచ్ఛనగరంగా నిలిచి సత్తా చాటిన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌.. ఇప్పుడు ప్లాస్టిక్‌ రహిత నగరంగా రికార్డుల్లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది.

Updated : 10 Jan 2023 08:12 IST

ఇప్పటికే వరుసగా ఆరుసార్లు స్వచ్ఛనగరంగా నిలిచి సత్తా చాటిన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌.. ఇప్పుడు ప్లాస్టిక్‌ రహిత నగరంగా రికార్డుల్లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం అధికారులు వినూత్నంగా ఆలోచించి పర్యావరణహితమైన నూలు సంచులు అందించే ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఇందౌర్‌లో పాలిథిన్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. నగరంలోని మార్కెట్లలో పాలిథిన్‌ కవర్లు వాడితే జరిమానా విధిస్తున్నారు. వాటి స్థానంలో పర్యావరణహితంగా ఉండే నూలు సంచులు వాడాలని సూచిస్తున్నారు. అయిదు ప్రధాన కూడళ్లలో నూలు సంచుల ఏటీఎంలను ఏర్పాటు చేశారు. పది రూపాయల నోటు లేదా నాణేన్ని యంత్రంలో ఉంచితే, కొన్ని సెకన్లలో నూలు సంచి బయటకు వస్తుంది. దీనికి యూపీఐ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని