Ashok khemka: 56వ సారి ఐఏఎస్‌ అశోక్‌ ఖేమ్కా బదిలీ

ఎక్కువ సార్లు బదిలీ అయ్యే ఐఏఎస్‌ అధికారిగా పేరున్న అశోక్‌ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాతో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్‌) శాఖకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

Updated : 10 Jan 2023 07:48 IST

హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి ఆర్కైవ్స్‌ శాఖకు

చండీగఢ్‌: ఎక్కువ సార్లు బదిలీ అయ్యే ఐఏఎస్‌ అధికారిగా పేరున్న అశోక్‌ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాతో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్‌) శాఖకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 30 ఏళ్ల కెరీర్‌లో ఖేమ్కాకు ఇది 56వ బదిలీ. ఉత్తర్వుల్లో పేర్కొనకపోయినప్పటికీ..కొన్ని రోజుల క్రితం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి రాసిన లేఖ దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నతవిద్యా శాఖలో విలీనం చేయడంతో పని లేకుండా పోయిందని ఖేమ్కా ఆ లేఖలో పేర్కొన్నారు. తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పని ఉండాలని సీఎస్‌కు సూచించారు. తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగిన ఖేమ్కా ఆర్కైవ్స్‌ శాఖలో పనిచేయడం ఇది నాలుగోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని