Diamonds: 26 వేల వజ్రాలతో మహా ఉంగరం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన ‘డాజ్లింగ్‌ జ్యువెలరీ’ అనే ఆభరణాల తయారీ సంస్థ ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారుచేసింది.

Updated : 11 Jan 2023 09:16 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన ‘డాజ్లింగ్‌ జ్యువెలరీ’ అనే ఆభరణాల తయారీ సంస్థ ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారుచేసింది. 26,200 వజ్రాలతో పువ్వు ఆకారంలో ఉన్న ఉంగరం చూపరులను ఆకట్టుకుంటోంది. సంస్థ యజమాని విపుల్‌ అగర్వాల్‌ ఈ ఉంగరానికి ‘దేవ్‌ ముద్రిక’ అని పేరు పెట్టారు. ఇంతకుముందు దక్షిణాదికి చెందిన ఓ సంస్థ 24 వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారుచేసిందని విపుల్‌ తెలిపారు. ఉంగరం డిజైన్‌ను మొదట సాఫ్ట్‌వేర్‌ ద్వారా రూపొందించి.. తర్వాత కళాకారులతో తయారు చేయించినట్లు వివరించారు. 8 నుంచి 10 మంది కళాకారులు మూడు నెలలపాటు కష్టపడ్డారు. దీన్ని రెండు వేళ్లకు పెట్టుకోవచ్చు. ఈ ఉంగరానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు కోసం దరఖాస్తు చేశామని, స్థానం సంపాదించాక ధర నిర్ణయిస్తామని విపుల్‌ అగర్వాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని