JEE Advanced: 75% మార్కులు రాకపోయినా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవ్వొచ్చు

ప్రతి విద్యామండలిలో పర్సంటైల్‌లో అగ్రస్థానంలో ఉన్న తొలి 20 మందికి ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశ పరీక్షలో ఒక సడలింపు లభించనుంది.

Updated : 11 Jan 2023 06:46 IST

పర్సంటైల్‌లో అగ్రస్థానంలో ఉన్నవారికి మినహాయింపు

దిల్లీ: ప్రతి విద్యామండలిలో పర్సంటైల్‌లో అగ్రస్థానంలో ఉన్న తొలి 20 మందికి ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశ పరీక్షలో ఒక సడలింపు లభించనుంది. 12వ తరగతిలో వారు కనీసం 75% మార్కులు సాధించకపోయినా ఈ ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరుకావచ్చని కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి సడలింపు ఇవ్వాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ‘అనేక రాష్ట్రాల్లో పర్సంటైల్‌లో అగ్రస్థానంలో ఉంటున్న అభ్యర్థులు 12వ తరగతిలో 75% (అంటే 350) మార్కుల్ని సాధించలేకపోతున్నారు. అలాంటివారందరికీ తాజా నిర్ణయం ఉపయోగపడుతుంది. జేఈఈ-మెయిన్‌ తొలి విడతకు ఆన్‌లైన్‌లో నమోదుకు గడువు ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. మరోవైపు- ఈ నెల చివరివారంలో జరగాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదా వేయాలన్న వినతిని బొంబాయి హైకోర్టు మంగళవారం తిరస్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని