Youtube: ‘యూట్యూబ్’ సంపాదనతో ఆడీ కారు
బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఆడీ కారు కొన్నాడు. కొవిడ్ లాక్‌డౌన్ నుంచి యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు.
బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఆడీ కారు కొన్నాడు. కొవిడ్ లాక్‌డౌన్ నుంచి యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన సంపాదనతోనే దాదాపు రూ. 50 లక్షల విలువైన ఆడీ కారు కొన్నాడా యువకుడు. ప్రస్తుతం దీన్ని పశువుల దొడ్డి దగ్గర ఉంచుతున్నాడు. ఔరంగాబాద్‌లోని జసోయా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ నెలకు రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ‘ధాకడ్’ అనే న్యూస్ రిపోర్టర్ పేరుతో.. రకరకాల సమస్యలపై కామెడీ వీడియోలు చేస్తూ నవ్విస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఛానల్‌కు 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.