Jharkhand: కల్వర్టుతో బాలుడి వివాహం
ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్‌లో అరుదైన వివాహం జరిగింది. గిరిజన సంప్రదాయం ప్రకారం ఓ బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించింది ఓ కుటుంబం. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు అఖన్న జాతర జరుపుకొంటారు.
ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్‌లో అరుదైన వివాహం జరిగింది. గిరిజన సంప్రదాయం ప్రకారం ఓ బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించింది ఓ కుటుంబం. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు అఖన్న జాతర జరుపుకొంటారు. ఈ సందర్భంగా.. చెట్టుకు లేదా కల్వర్టుకు చిన్నారులను ఇచ్చి వివాహం జరిపించడం వీరికి సంప్రదాయంగా వస్తోంది. పిల్లలకు తొలి దంతం పైదవడకు వస్తే.. వారికి ఇలా వివాహం జరిపిస్తారు. లేదంటే అశుభం జరుగుతుందని నమ్ముతుంటారు. కల్వర్టు, చెట్టుకు వివాహం జరిపించకపోతే.. వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి భాగస్వామి వెంటనే మరణిస్తారని విశ్వసిస్తుంటారు. అందుకే, అలాంటి చిన్నారులకు ఐదేళ్ల వయసు వచ్చే లోపే కల్వర్టులు, చెట్లకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని పోట్కా ప్రాంతానికి చెందిన సరీ సింగ్ సర్దార్.. తన మనవడికి వివాహం జరిపించారు. చిన్నారిని పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి.. బొమ్మ బైక్‌పై ఊరేగిస్తూ కల్వర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడే వివాహ తంతు జరిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి