CV Ananda Bose: 26న బెంగాల్‌ గవర్నర్‌ అక్షరాభ్యాసం!

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌కు ఈ నెల 26న అక్షరాభ్యాసం జరగనుంది! ఈ వయసులో ఆయనకు అక్షరాభ్యాసం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఆశ్చర్యకరమే అయినా.. అదే నిజం!

Updated : 20 Jan 2023 09:16 IST

సీఎం మమతా బెనర్జీ సమక్షంలో..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌కు ఈ నెల 26న అక్షరాభ్యాసం జరగనుంది! ఈ వయసులో ఆయనకు అక్షరాభ్యాసం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఆశ్చర్యకరమే అయినా.. అదే నిజం! ఈ నెల 26న సరస్వతీ పూజను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆనందబోస్‌కు రాజ్‌భవన్‌లో ఈ క్రతువు జరగనుంది. సాధారణంగా బెంగాలీ (బంగ్లా) భాషలోని అక్షరాలను నేర్చుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు చిన్నారులకు ‘హతేఖోరీ’ పేరుతో సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాస తంతును నిర్వహిస్తారు. ఇప్పటికే ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్‌.. బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలన్న తన ఆసక్తిని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులైన తొలినాళ్లలోనే వెలిబుచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే భాష నేర్చుకునేందుకు తాజాగా అక్షరాభ్యాస ముహూర్తం నిశ్చయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని