డబ్బులు లెక్కించలేకపోయాడని పెళ్లికి నిరాకరణ

పెళ్లి కుమారుడు నిరక్షరాస్యుడని ఓ వధువు అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో వెలుగుచూసింది.

Updated : 22 Jan 2023 10:43 IST

ఫరూఖాబాద్‌: పెళ్లి కుమారుడు నిరక్షరాస్యుడని ఓ వధువు అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో వెలుగుచూసింది. వరుడుకి వధువు సోదరుడు డబ్బులు లెక్కించమని ఇచ్చాడు. ఆ డబ్బులను వరుడు లెక్కించలేకపోయాడు. ఈ విషయం వధువుకు తెలిసింది. దీంతో అతడిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పింది.  ఇరుకుటుంబాల మధ్య సయోధ్య కోసం పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని