Vehicle Insurance: ఇన్సూరెన్స్‌ లేని వాహనం ఢీకొన్నా నష్టపరిహారం

బీమా లేని వాహనాలు ఢీకొన్న ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయమై చట్టబద్ధమైన నిబంధనలను ఆరు నెలల్లోపు అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Published : 23 Jan 2023 08:50 IST

6 నెలల్లో చట్టబద్ధత: కేంద్రం

దిల్లీ: బీమా లేని వాహనాలు ఢీకొన్న ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయమై చట్టబద్ధమైన నిబంధనలను ఆరు నెలల్లోపు అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇన్సూరెన్స్‌ లేని ట్రాక్టరు ఢీకొట్టడం వల్ల చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు నష్టపరిహారం కోసం వేసిన పిటిషన్‌ విచారణకు రాగా.. హిట్‌ అండ్‌ రన్‌, బీమా లేని వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి అనుగుణంగా ఇప్పటికే మోటారు వాహన చట్టానికి సవరణలు చేశామని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అయితే మార్గదర్శకాలను రూపొందించి, దేశమంతా వాటిని అమలు చేయడానికి తమకు ఆరు నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని