Friendship: చిన్నారి భుజాలపై స్నేహితురాలి బడిబాట!

పోలియో సోకి నడవలేని స్థితిలో ఉన్న స్నేహితురాలిని ఓ బాలిక రోజూ వీపుపై మోసుకుంటూ బడికి తీసుకెళ్తోంది.

Updated : 23 Jan 2023 09:32 IST

కటక్‌, న్యూస్‌టుడే: పోలియో సోకి నడవలేని స్థితిలో ఉన్న స్నేహితురాలిని ఓ బాలిక రోజూ వీపుపై మోసుకుంటూ బడికి తీసుకెళ్తోంది. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలోని కోయిడ సమితి కుసుముండి గ్రామ పాఠశాలలో ముంగిరి బడా (9) ఐదో తరగతి చదువుతోంది. తన స్నేహితురాలు జయసిక బడా(8)కు పోలియో సోకడంతో ఇంట్లోనే ఉండేది. ఆడుకునే సమయంలో తనకూ చదువుకోవాలని ఉందని, కానీ పాఠశాలకు తీసుకెళ్లేవారు లేరని జయసిక బాధపడేది. స్నేహితురాలి ఆవేదనను అర్థం చేసుకున్న ముంగిరి తను చదివే పాఠశాలలోనే ఒకటో తరగతిలో చేర్పించింది. రోజూ జయసికను వీపుపై మోసుకుంటూ అర కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు తీసుకెళ్తోంది. ముంగిరి చొరవకు స్థానికులు ముచ్చటపడి, ఆమెను అభినందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని