నేవీలో చేరిన ఐఎన్‌ఎస్‌ వాగీర్‌

కల్వరీ తరగతికి చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాగీర్‌ భారత నేవీలో అధికారికంగా చేరింది. ముంబయిలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.

Published : 24 Jan 2023 04:57 IST

ముంబయి: కల్వరీ తరగతికి చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాగీర్‌ భారత నేవీలో అధికారికంగా చేరింది. ముంబయిలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ప్రాజెక్ట్‌ 75’లో భాగంగా స్కార్పియన్‌ సాంకేతికతతో మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ ఐఎన్‌ఎస్‌ వాగీర్‌ను నిర్మించింది. దీని కోసం ఫ్రాన్స్‌ నావల్‌ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వైర్‌ గైడెడ్‌ టార్పెడోలు, పాక్షిక ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, అత్యంత శక్తిమంతమైన డీజిల్‌ ఇంజిన్లు, అత్యాధునిక సెన్సర్‌లు, టార్పెడో డెకాయ్‌, సోనార్‌, స్టెల్త్‌ వ్యవస్థలతో వాగీర్‌ను అత్యున్నత సాంకేతికతతో నిర్మించారు. వాగీర్‌ అంటే షార్క్‌ అని అర్థమని, షార్క్‌కు ఉండే గోప్యత, నిర్భయత్వం దీని సొంతమని భారత నేవీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని