స్వర్ణ పతంగి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో బంగారంతో పతంగి తయారు చేశారు. చరఖా, దారాన్ని కూడా బంగారంతోనే రూపొందించారు. అభరణాలకు ప్రసిద్ధిగాంచిన మేరఠ్‌ నగరంలో దీని రూపకల్పన జరిగింది.

Published : 24 Jan 2023 04:50 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో బంగారంతో పతంగి తయారు చేశారు. చరఖా, దారాన్ని కూడా బంగారంతోనే రూపొందించారు. అభరణాలకు ప్రసిద్ధిగాంచిన మేరఠ్‌ నగరంలో దీని రూపకల్పన జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గాలిపటం ఇదేనని తయారీదారులు చెబుతున్నారు. ఈ నెల 26న వసంత పంచమి సందర్భంగా ఈ బంగారు పతంగి తయారు చేసినట్లు స్వర్ణకారులు అంకుర్‌ జైన్‌, రితేశ్‌ జైన్‌ తెలిపారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 16 మంది కలిసి, 16 రోజుల పాటు కష్టపడి తయారు చేసినట్లు వెల్లడించారు. దీనికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. సాధారణంగా వసంత పంచమి రోజు పతంగులను ఎగురవేస్తారు. కానీ ఆ రోజు రిపబ్లిక్‌ డే ఉన్న నేపథ్యంలో గాలిపటాలను ఎగుర వేయకూడదని నిర్ణయించుకున్నట్లు స్వర్ణకారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని