దిల్లీ-హైదరాబాద్‌ విమానంలో ప్రయాణికుడి దించివేత

మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినందుకు ఓ ప్రయాణికుడిని స్పైస్‌జెట్‌ విమానం నుంచి దించివేసిన ఘటన సోమవారం దిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

Updated : 24 Jan 2023 04:48 IST

సిబ్బందితో అనుచిత ప్రవర్తన..

దిల్లీ: మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినందుకు ఓ ప్రయాణికుడిని స్పైస్‌జెట్‌ విమానం నుంచి దించివేసిన ఘటన సోమవారం దిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాల్సిన ఎస్‌జి-8133 విమానంలో జరిగిన ఘటనపై క్రూ విభాగం ఉద్యోగిని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. బోర్డింగ్‌ సమయంలో తనపట్ల ఓ ప్రయాణికుడు, అతనితోపాటు ఉన్న వ్యక్తి అసభ్యంగా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న ఇద్దరు వ్యక్తుల్ని విమానం నుంచి దించివేసి దిల్లీ విమానాశ్రయ పోలీసు స్టేషన్లో అప్పగించారు. విమాన ఘటనపై తగిన చర్య తీసుకుంటామని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. సిబ్బందికి, ఇద్దరు ప్రయాణికులకు మధ్య జరిగిన ఘర్షణ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని