‘జమిలి’పై తాజా సూచనలు చేయండి

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై తాజాగా సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌ సహా పలు రాజకీయ పార్టీలను న్యాయ కమిషన్‌ కోరింది.

Published : 24 Jan 2023 04:39 IST

 ఈసీ, రాజకీయ పార్టీలను కోరిన న్యాయ కమిషన్‌

దిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై తాజాగా సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌ సహా పలు రాజకీయ పార్టీలను న్యాయ కమిషన్‌ కోరింది. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై రూపొందించిన ముసాయిదా నివేదికలో గత కమిషన్‌ ఆరు అభ్యంతరాలను లేవనెత్తింది. ఈ క్రమంలో సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలపాలంటూ 22వ న్యాయ కమిషన్‌ గత నెలలో పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. అందులో 21వ న్యాయ కమిషన్‌ ప్రశ్నలపై మళ్లీ అభిప్రాయాలను కోరుతున్నట్లు పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని