డిజిటలైజేషన్‌ దిశగా వ్యాక్సినేషన్‌ ప్రకియ

చిన్నపిల్లలకు, గర్భిణీలకు వివిధ టీకాలు పలు డోసుల్లో వేయాల్సి ఉంటుంది. వాటిని ఎప్పుడు వేయించుకోవాలో గుర్తుంచుకోవడం సామాన్యులకు కొద్దిగా కష్టమే.

Published : 24 Jan 2023 04:39 IST

ఇక ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుకింగ్‌
యువిన్‌ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చిన కేంద్రం

దిల్లీ: చిన్నపిల్లలకు, గర్భిణీలకు వివిధ టీకాలు పలు డోసుల్లో వేయాల్సి ఉంటుంది. వాటిని ఎప్పుడు వేయించుకోవాలో గుర్తుంచుకోవడం సామాన్యులకు కొద్దిగా కష్టమే. ఇలాంటి ఇబ్బందులు లేకుండా సార్వజనీక టీకా కార్యక్రమాన్ని(యూఐపీ) డిజిటలైజ్‌ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ సంక్షోభంలో అందరికీ అక్కరకు వచ్చిన ‘కొవిన్‌’ తరహాలో ‘యువిన్‌’ ప్లాట్‌ఫాంను తీసుకువచ్చింది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండేసి జిల్లాల్లో తాజాగా దీనిని ప్రారంభించింది. గర్భిణీ వివరాలు, ప్రసవం అయ్యే తేదీ, పుట్టిన బిడ్డ వివరాలు, వేయాల్సిన, వేయించుకున్న టీకాల తేదీలను స్థానిక సిబ్బంది ఇందులో నమోదు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని