14 ఏళ్లలోపు బాలికలను పెళ్లాడితే పోక్సో కేసు

అస్సాంలో 14 ఏళ్ల లోపు వయసున్న బాలికలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ శిక్ష విధించనున్నారు.

Published : 24 Jan 2023 04:39 IST

అస్సాం కేబినెట్‌ నిర్ణయం

గువాహటి: అస్సాంలో 14 ఏళ్ల లోపు వయసున్న బాలికలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ శిక్ష విధించనున్నారు. సోమవారం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అస్సాంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. బాల్య వివాహాలే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. వచ్చే అయిదేళ్లలో బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒకవేళ 14 ఏళ్ల లోపు బాలికలను అదే వయసులోపు బాలురు వివాహం చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారని విలేకర్లు ప్రశ్నించగా.. అలాంటి వివాహాలను చట్టవిరుద్ధంగా ప్రకటించి, బాలురను జువైనల్‌ హోంకు తరలిస్తామని చెప్పారు. 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద శిక్షించనున్నట్లు తెలిపారు. ఏ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకోలేదని, దీనికి రాజకీయ రంగు పులమొద్దని హిమంత పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని