భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం

డిజిటల్‌ మీడియాలో వచ్చే వార్తలను ఫ్యాక్ట్‌ చెకింగ్‌ చేసేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)ను అనుమతిస్తున్న ప్రతిపాదిత సవరణ అమలుపై భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మంగళవారం ప్రకటించారు.

Published : 25 Jan 2023 03:25 IST

పీఐబీ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ అమలుపై కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: డిజిటల్‌ మీడియాలో వచ్చే వార్తలను ఫ్యాక్ట్‌ చెకింగ్‌ చేసేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)ను అనుమతిస్తున్న ప్రతిపాదిత సవరణ అమలుపై భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మంగళవారం ప్రకటించారు. వచ్చే నెలలో ఈ సంప్రదింపులు ఉంటాయని ఆ తర్వాతే అమలుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదిత సవరణపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ను క్రమబద్ధీకరించే దిశగా రూపొందిస్తున్న నిబంధనలను జనవరి 31కి నోటిఫై చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు.

దాన్ని తొలగించాలి..: ఐఎన్‌ఎస్‌

పీఐబీకి ఫ్యాక్ట్‌ చెకింగ్‌ అధికారాన్ని కట్టబెడుతున్న ప్రతిపాదిత సవరణను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఐటీ చట్టంలో ఉన్న ఈ సవరణపై సంబంధిత భాగస్వామ్య పక్షాలతో చర్చించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకోవాలని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖను కోరింది. డిజిటల్‌ మీడియాపై పీఐబీని ఫ్యాక్ట్‌ చెకింగ్‌కు నోడల్‌ ఏజెన్సీగా ఉంచడం ద్వారా ప్రభుత్వం న్యాయమూర్తి పాత్రలోకి మారుతోందని ఐఎన్‌ఎస్‌ అభిప్రాయపడింది. ప్రభుత్వ విధానాలపై మీడియా వెలువరించే విమర్శలను, వ్యాఖ్యానాలను ఇది అడ్డుకునే ప్రమాదముందని వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని