బాలల పురస్కార విజేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ

‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’ విజేతలతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం తన నివాసంలో ముచ్చటించారు. పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులు, మానసిక ఆరోగ్య సమస్యలు గురించి వారితో మాట్లాడారు.

Published : 25 Jan 2023 03:25 IST

దిల్లీ: ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’ విజేతలతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం తన నివాసంలో ముచ్చటించారు. పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులు, మానసిక ఆరోగ్య సమస్యలు గురించి వారితో మాట్లాడారు. చిన్నచిన్న సమస్యల్ని పరిష్కరించుకుంటూ, క్రమేపీ సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలనీ, తద్వారా జీవితంలో పెద్ద సమస్యల్ని అధిగమించే స్థాయికి చేరుకోవాలని వారికి ఉద్బోధించారు. మానసిక సమస్యలు ఉన్నవారి విషయంలో కుటుంబ పాత్ర కీలకంగా నిలుస్తుందని చెప్పారు. చదరంగం ఆడడం వల్ల కలిగే ప్రయోజనం, కళలు-సంస్కృతిని ఉద్యోగావకాశంగా మలచుకోవడం, పరిశోధనలు-నవకల్పనలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలను ఈ భేటీలో మోదీ ప్రస్తావించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పురస్కార గ్రహీతలు సాధించిన అంశంపై ఒక్కొక్కరితో మోదీ ముందుగా కాసేపు మాట్లాడారు. తర్వాత అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లలు తమకు ఎదురవుతున్న సవాళ్లపై ప్రధానితో స్వేచ్ఛగా చర్చించారు. వివిధ అంశాల్లో ఆయన సూచనల్ని తెలుసుకున్నారు. నవకల్పనలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సాహసాలు వంటి అంశాల్లో ఈ ఏడాది 11 మంది పిల్లలకు పురస్కారాలు ఇచ్చారు. ఈ బాలల ప్రతిభను, గొప్పతనాన్ని కొనియాడుతూ ఆయన ట్వీట్లు చేశారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని