స్వదేశీ తయారీ హెచ్‌పీవీ టీకా ఆవిష్కరణ
మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను నిరోధించే స్వదేశీ తయారీ హెచ్‌పీవీ టీకా(వ్యాక్సిన్)ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఆవిష్కరించింది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధంలో ఉపయోగపడనున్న వ్యాక్సిన్
దిల్లీ: మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను నిరోధించే స్వదేశీ తయారీ హెచ్‌పీవీ టీకా(వ్యాక్సిన్)ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఆవిష్కరించింది. ‘సర్వోవ్యాక్’ పేరిట అభివృద్ధి పరచిన ఈ వ్యాక్సిన్‌ను జాతీయ బాలికాదినోత్సవం, సర్వైకల్ క్యాన్సర్ అవగాహనా నెల సందర్భంగా మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆవిష్కరించారు. ఈ మేరకు ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా ట్విటర్లో తెలిపారు. దీని తయారీకి తమ సంస్థ ఆరు నుంచి ఏడు సంవత్సరాల పాటు కృషి చేసిందని ఇటీవలే దావోస్‌లో పూనావాలా వెల్లడించారు. సర్వోవ్యాక్ అభివృద్ధిలో సీరం ఇన్స్టిట్యూట్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్, బిల్ అండ్ మిలిందా గేట్్్స ఫౌండేషన్ల భాగస్వామ్యం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తా: రేణుకా చౌదరి
-
General News
KTR: 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ: మంత్రి కేటీఆర్
-
India News
INS Vikrant: ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై యుద్ధవిమానం ల్యాండింగ్
-
Politics News
TS Budget: తెలంగాణ బడ్జెట్.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే: బండి సంజయ్
-
General News
Supreme court: ఎఫ్డీలను జప్తు చేశారో? లేదో? వివరాలివ్వండి: భారతీ సిమెంట్స్‌కు సుప్రీం ఆదేశం
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!