Air India: ఎక్కువైంది.. ‘ఇక మద్యం ఇవ్వం’ అనొచ్చు

తమ విమానాల్లో ఇటీవల జరిగిన ఘటనలతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణాల్లో మద్యం అందించే విధానానికి జనవరి 19న కొన్ని సవరణలు చేసింది.

Updated : 25 Jan 2023 08:00 IST

విమాన సిబ్బందికి ఎయిరిండియా సూచన

దిల్లీ: తమ విమానాల్లో ఇటీవల జరిగిన ఘటనలతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణాల్లో మద్యం అందించే విధానానికి జనవరి 19న కొన్ని సవరణలు చేసింది. ప్రయాణికులు ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం తీసుకుంటున్నారని భావిస్తే ఆపైన వారికి సర్వ్‌ చేయడానికి నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. అయితే అది గౌరవప్రదమైన పద్ధతిలో ఉండాలని స్పష్టం చేసింది. ‘ఇక మద్యం ఇవ్వం’ అని చెప్పే సందర్భంలో వారిని తాగుబోతు అని పిలవకూడదు, వాదనకు దిగకూడదు, హెచ్చుగా మాట్లాడకూడదు అని సూచించింది. సొంతంగా మద్యం తెచ్చుకుని తాగే ప్రయాణికులను గుర్తించేబాధ్యత సిబ్బందిదేనని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని