50 నిమిషాల్లోనే 1,484 ఆగ్రో రోబోల తయారీ..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన విద్యార్థులు 1,484 ఆగ్రో రోబోలను తయారు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను నెలకొల్పారు. వివిధ పాఠశాలలకు చెందిన 6 నుంచి 9 తరగతులకు చెందిన 1,484 మంది విద్యార్థులు కేవలం 50 నిమిషాల్లోనే వీటిని తయారు చేశారు.

Published : 25 Jan 2023 06:06 IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన విద్యార్థులు 1,484 ఆగ్రో రోబోలను తయారు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను నెలకొల్పారు. వివిధ పాఠశాలలకు చెందిన 6 నుంచి 9 తరగతులకు చెందిన 1,484 మంది విద్యార్థులు కేవలం 50 నిమిషాల్లోనే వీటిని తయారు చేశారు. చైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. విజ్ఞాన్‌ భారతి ఆర్గనైజింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో.. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నిర్వహించిన సైన్స్‌ ఫెయిర్‌ దీనికి వేదికైంది. ఇందులో పాల్గొన్న విద్యార్థులు.. నాలుగు రకాల ఆగ్రో రోబోలను రూపొందించారు. అందులో ఒకటి విత్తనాలను మట్టిలో నాటడానికి సహాయపడగా.. రెండోరకం రోబో మొక్కలకు నీటిని అందించడానికి ఉపయోగపడేవి. నేలను చదును చేయడానికి ఒకటి.. నేలను దున్నడానికి మరో రోబో సహాయపడుతుందని కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని