పేజీకో కరెన్సీ నోటు.. పుస్తకంలో రూ.74లక్షలు

అక్రమంగా విదేశీ కరెన్సీ, బంగారం తీసుకొస్తున్న ఇద్దరు విదేశీయులను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

Published : 25 Jan 2023 03:25 IST

అక్రమంగా విదేశీ కరెన్సీ, బంగారం తీసుకొస్తున్న ఇద్దరు విదేశీయులను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరిని అరెస్టు చేశారు. జనవరి 22 అర్ధరాత్రి తర్వాత ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ విదేశీ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కన్పించడంతో అతడి లగేజీని పరిశీలించారు. ఈ తనిఖీల్లో రెండు పుస్తకాల్లో దాచిన డాలర్ల కట్టలు బయటపడ్డాయి. పుస్తకాల పేజీల మధ్య నోట్లను అతికించాడు. మొత్తం 90వేల డాలర్ల (దాదాపు రూ.74లక్షలు)ను గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి పత్రాలు లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విమానాశ్రయంలో దుబాయి నుంచి వచ్చిన పాలస్తీనాకు చెందిన మరో ప్రయాణికుడి నుంచి 2.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ఆ బంగారాన్ని పేస్ట్‌ రూపంలో దాచి తీసుకురాగా.. తనిఖీల్లో బయటపడింది. దీంతో అతడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని