120 గంటలపాటు మోత మోగిన తబలా

120 గంటలపాటు నిర్విరామంగా తబలా వాయించి అరుదైన ఘనతను సాధించాడు పంజాబ్‌కు చెందిన యువకుడు.

Published : 25 Jan 2023 03:25 IST

120 గంటలపాటు నిర్విరామంగా తబలా వాయించి అరుదైన ఘనతను సాధించాడు పంజాబ్‌కు చెందిన యువకుడు. బటాలా నగరానికి చెందిన అమృత్‌ప్రీత్‌ సింగ్‌ ఇండియాస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు 110 గంటలుగా ఉండేది. వరుసగా ఐదు రోజులు తబలా వాయించడం ద్వారా అమృత్‌ ప్రీత్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. గతేడాది డిసెంబరు 31న ఉదయం 11 గంటలకు తబలా వాయించడం ప్రారంభించిన అతను ఈ నెల 5న ఉదయం 11 గంటలకు దీన్ని ముగించాడు. ప్రస్తుతం లిమ్కా, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు