తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు

తల్లి ఒంటరి తనాన్ని చూసి తట్టుకోలేకపోయాడా యువకుడు. కానుకగా ఆమెకు తోడును ఇవ్వాలనుకున్నాడు.

Published : 25 Jan 2023 03:57 IST

తల్లి ఒంటరి తనాన్ని చూసి తట్టుకోలేకపోయాడా యువకుడు. కానుకగా ఆమెకు తోడును ఇవ్వాలనుకున్నాడు. సమాజమంతా దూషించినా.. 40 ఏళ్ల తల్లికి రెండో పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందిన యువరాజ్‌ షేలే(23) చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటినుంచి అతడి తల్లి ఒంటరిగానే జీవిస్తోంది. షీలేనే కుటుంబ బాధ్యతలన్నీ చూస్తున్నాడు. తండ్రి మరణించిన నాటి నుంచి తల్లి ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవిస్తోంది. పొరుగువారితోనూ ఎలాంటి సంబంధాలు లేకుండా ఉండటాన్ని చూసి ఆ యువకుడి మనసును కలిచి వేసింది. ఆమె బాధను తొలగించాలనే ఉద్దేశంతో రెండో పెళ్లి చేయాలనుకున్నాడు షీలే. దీంతో స్నేహితులు, బంధువుల సహాయంతో పెళ్లికొడుకు కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలోనే మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైనవాడని భావించాడు. తల్లితో చర్చించిన అనంతరం వారిద్దరికి వివాహం జరిపించాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని