బాల మేధావికి ప్రధాని సహా ప్రముఖుల అభినందనల వెల్లువ

చిన్నవయస్సులోనే ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ అభివృద్ధి చేసి, ‘ఎలిమెంట్‌ ఆఫ్‌ హర్థ్‌’ అనే పుస్తకాన్ని రాసిన బెంగళూరు నగరానికి చెందిన బాలుడు రిషి శివప్రసన్న(8)కు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం- 2023’ దక్కింది.

Updated : 25 Jan 2023 08:57 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిన్నవయస్సులోనే ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ అభివృద్ధి చేసి, ‘ఎలిమెంట్‌ ఆఫ్‌ హర్థ్‌’ అనే పుస్తకాన్ని రాసిన బెంగళూరు నగరానికి చెందిన బాలుడు రిషి శివప్రసన్న(8)కు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం- 2023’ దక్కింది. కేంద్ర మానవ వనరులశాఖ దేశంలోని అసాధారణ ప్రతిభావంతులైన పలువురు బాలలను గుర్తించింది. వీరికి సోమవారం రాత్రి దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు పొందారు. రిషి సాధనలు అపూర్వమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి ఐక్యూ- 180 ఉన్నట్లు విద్యావేత్తలు ప్రకటించారు. బాలుడి తండ్రి శివప్రసన్నకుమార్‌ బెంగళూరులో ప్రైవేటు అధ్యాపకుడు. తల్లి ఐటీ ఇంజినీరు. బాలుడి ప్రతిభను గుర్తించిన మైసూరు సుత్తూరు మఠాధిపతి దేశీకేంద్ర స్వామి, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ సుధామూర్తి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ.. బాగా చదివి, క్యాన్సర్‌కు మందు కనిపెడతానంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని