గణతంత్ర వేడుకలు.. భద్రతా వలయంలో దిల్లీ

గణతంత్ర వేడుకల్లో భాగంగా దేశ రాజధాని దిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు, గస్తీలు నిర్వహిస్తున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు.

Published : 25 Jan 2023 04:49 IST

దిల్లీ: గణతంత్ర వేడుకల్లో భాగంగా దేశ రాజధాని దిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు, గస్తీలు నిర్వహిస్తున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు, హోటళ్లు, బస్‌ టర్మినళ్లు, మెట్రో స్టేషన్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో 65వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘‘ఈ వేడుకలకు 6వేల మంది భద్రతా సిబ్బందిని నియమించాం. 1500 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పాస్‌పై ఇచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసే వేడుకలకు అనుమతిస్తాం’’ అని డీసీపీ ప్రణవ్‌ తయాల్‌ వెల్లడించారు.

రాష్ట్రపతి ప్రసంగం: ఈ ఏడాది జరగబోయే 74వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో హిందీ, ఇంగ్లీషు భాషలో ఇది ప్రసారం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని