రూ. 50 కోట్లు ఇవ్వండి.. లేదంటే తీవ్ర పరిణామాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ ను బెదిరిస్తూ ఓ లేఖ రావడం కలకలం సృష్టించింది.

Published : 25 Jan 2023 04:49 IST

పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ను బెదిరిస్తూ లేఖ

రాయ్‌గఢ్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ ను బెదిరిస్తూ ఓ లేఖ రావడం కలకలం సృష్టించింది. రూ. 50కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు అందులో డిమాండ్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లేఖపై దర్యాప్తు చేపట్టగా.. ఓ ఖైదీ దాన్ని పంపించినట్లు తేలింది. ఛత్తీస్‌గఢ్‌లోని పాత్రపాలిలో ఉన్న జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీకి గతవారం పోస్టు ద్వారా ఓ లేఖ వచ్చింది. నవీన్‌ జిందాల్‌ 48 గంటల్లోగా రూ.50కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఓ ఆగంతుకుడు ఆ బెదిరింపు లేఖను పంపాడు. దీంతో జిందాల్‌ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బిలాస్‌పుర్‌ సెంట్రల్‌ జైలులోని ఓ ఖైదీ దీన్ని పంపినట్లు తేలింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఎవరనే వివరాలను మాత్రం బయటపెట్టలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని