వేరే అబ్బాయిని కలిసిందనే ఆగ్రహంతో శ్రద్ధా హత్య

శ్రద్ధావాకర్‌ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగిన రోజు శ్రద్ధ మరో అబ్బాయిని కలవడానికి వెళ్లడంతో ఆగ్రహానికి గురైన ఆఫ్తాబ్‌ పూనావాలా ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

Updated : 25 Jan 2023 12:48 IST

6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను సమర్పించిన పోలీసులు

దిల్లీ: శ్రద్ధావాకర్‌ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగిన రోజు శ్రద్ధ మరో అబ్బాయిని కలవడానికి వెళ్లడంతో ఆగ్రహానికి గురైన ఆఫ్తాబ్‌ పూనావాలా ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అనంతరం వివిధ రకాల పదునైన వస్తువులు ఉపయోగించి మృతదేహాన్ని ముక్కలు చేశాడని తెలిపారు. 6,629 పేజీల ఈ అభియోగపత్రాన్ని పోలీసులు కోర్టుకు మంగళవారం సమర్పించారు. అనంతరం నిందితుడు ఆఫ్తాబ్‌కు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీని న్యాయస్థానం ఫిబ్రవరి 7 వరకు పొడిగించింది. కేసు పటిష్టంగా ఉండేందుకు 150 మంది సాక్ష్యాలను, డిజిటల్‌, ఫోరెన్సిక్‌ ఆధారాలను పకడ్బందీగా నమోదు చేశామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని