నీరవ్‌ మోదీ కేసులో ముఖ్య వ్యక్తికి కోర్టు ఊరట

బ్యాంకును మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన ఫైర్‌ స్టార్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారి రవి శంకర్‌ గుప్తాపై సీబీఐ జారీ చేసిన లుకౌట్‌ నోటీసును ముంబయి ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

Published : 25 Jan 2023 04:53 IST

దిల్లీ: బ్యాంకును మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన ఫైర్‌ స్టార్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారి రవి శంకర్‌ గుప్తాపై సీబీఐ జారీ చేసిన లుకౌట్‌ నోటీసును ముంబయి ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని గుప్తాకు సూచించింది. నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ చోక్సీలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పి.ఎన్‌.బి)ని తప్పుడు పత్రాలతో రూ.13వేల కోట్ల మేర మోసగించారు. అందులో దాదాపు సగం నిధులకు సంబంధించిన వ్యవహారాలను గుప్తా పర్యవేక్షించారని సీబీఐ ఆరోపణ. ‘‘సీబీఐ కోరినప్పుడల్లా వచ్చి వారి ప్రశ్నలకు జవాబులిచ్చాను. ఇలా మొత్తం 31 సార్లు హాజరయ్యాను. నేను ఒక బహుళజాతి కంపెనీ కార్యనిర్వాహక డైరెక్టర్‌ను. కాబట్టి తరచూ విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దీనికి అనుమతించాలి’’ అని ప్రత్యేక కోర్టుకు గప్తా నివేదించారు. దీన్ని సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో గుప్తా నిందితుడు గాని, సాక్షి గాని కాదు కాబట్టి లుకౌట్‌ నోటీసును కొట్టివేస్తున్నామని కోర్టు ప్రకటించింది. నీరవ్‌ మోదీని బ్రిటన్‌ అరెస్టు చేయగా, చోక్సీ ఆంటిగువా, బార్బుడా పౌరసత్వం స్వీకరించి అక్కడ నిక్షేపంగా ఆశ్రయం పొందాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని