Currency: ప్రచారం కోసం కరెన్సీ నోట్ల వర్షం!

అది బెంగళూరులోని కేఆర్‌ మార్కెట్‌. ఇక్కడి పై వంతెన నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కరెన్సీ నోట్ల వాన కురిసింది.

Updated : 25 Jan 2023 07:20 IST

బెంగళూరులో ఓ వ్యక్తి దుశ్చర్య

బెంగళూరు(మల్లేశ్వరం), న్యూస్‌టుడే: అది బెంగళూరులోని కేఆర్‌ మార్కెట్‌. ఇక్కడి పై వంతెన నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కరెన్సీ నోట్ల వాన కురిసింది. వీటి కోసం పాదచారులు, వాహనదారులు పోటీపడటంతో వంతెన దిగువన కొంత సమయం రద్దీ నెలకొంది. నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని పరిశీలించగా.. తెల్ల చొక్కా, సూటు వేసుకున్న వ్యక్తి వంతెనపై కనిపించారు. ఆయనను నాగరబావిలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న అరుణ్‌గా గుర్తించారు. 400కు పైగా రూ.10 నోట్లతో పాటు కొన్ని రూ.100, రూ.200 నోట్లను తను తెచ్చుకున్న చిన్న సంచీ నుంచి తీసి కిందకి విసిరేశారు. నగదు ఖాళీ అయిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన సంస్థకు ప్రచారాన్ని కల్పించేందుకే ఇలా నోట్లు కిందకు విసిరారని పోలీసులు అనుమానిస్తున్నారు. అరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు